. . . 53 మంది మహిళలపై అఘాయిత్యం
. . . ఆపై వీడియోలతో బ్లాక్ మెయిల్
వెబ్ డెస్క్, బతుకమ్మ :
ఆ వీడియోల్లో సగం సంపన్న మహిళలే.. 58 మంది మహిళలను మత్తు పదార్థాలు ఇచ్చి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వారిపై అత్యాచారం చేసిన సంపన్న రాజకీయ జ్యోతిష్యుడు అశోక్ ఖరత్ పాపం పండింది. నాసిక్ లో అతడి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి పోలీసులు సడెన్ గా దాడి చేసి తప్పించుకోలేని విధంగా వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా సమాచారం అందితే రాజకీయ వర్గాల్లో అత్యంత బలమైన పలుకుబడి గల వ్యక్తి కాబట్టి సాక్షాలను తారుమారు చేస్తాడని భావించి అత్యంత రహస్యంగా పోలీసులు నాసిక్ లోని అతడి ఫామ్ హౌస్ లోకి అర్ధరాత్రి ప్రవేశించారు. ఆ తర్వాత బయట కలకలం సృష్టించి దొంగలు దొంగలంటూ కేకలు వేశారు. ఆ కేకలు వేస్తూ కొంతమంది పోలీసులు ఫామ్ హౌస్ లోకి చొరబడి బెడ్ రూమ్ లో ఉన్న అతడిని నిర్బంధించి హాల్ లోకి తీసుకెళ్లి బెడ్ రూమ్ మొత్తం తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, వీడియోలు, ల్యాప్ టాప్, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, కెమెరాలు, సెల్ ఫోన్లు దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలు చూసిన పోలీస్ లకు దిమ్మ తిరిగిపోయింది. వీడియోలు అన్ని కూడా మహిళలతో రాసలీలలు , వారికి డ్రగ్స్ ఇవ్వడం, వారితో కలిసి లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. వీటిని చూపించే అతడు మహిళలు బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని తెలుస్తోంది. ఇతడితో సాన్నిహిత్యం ఇతడిని గురువుగా భావించి పాదపూజ చేయడం వల్లనే మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చక్రకర్ రాజీనామా చేయవలసి వచ్చింది. ఈ దుర్మార్గుడు జ్యోతిష్యుడు , కాస్మటాలజిస్ట్, దైవాంశ సంభూతుడు ఇలాంటి బిరుదులని తగిలించుకొని చలామణి అయిపోతున్నాడు. ఇప్పుడు వాడి పాపం పండి ఆధారాలతో సహా పోలీసులకు చిక్కాడు. 35 ఏళ్ల మహిళ కొన్ని నెలల పాటు ఇతడి బందీగా లైంగికంగా చిత్రహింసల అనుభవించి ఫిర్యాదు చేసింది. ఆమె నుంచి ఆస్తులు రాబట్టుకొని ఇంకా ఆమెను బెదిరిస్తూ ఉండడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకే తీగలాగితే డొంక కదలినట్టు పోలీసులు ఒక్క విషయం కూడా బయటికి రాకుండా జాగ్రత్తగా వలపన్ని అన్ని ఆధారాలతో అరెస్టు చేశారు.