Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 10:55 pm Posted by : ramakrishna

దేశాభివృద్ధిలో రోబోటిక్స్ ది కీలక పాత్ర

  • అడ్వటెక్ రోబోటిక్స్ ఎం.డి మారుతి

 

భీమ్ గల్, బతుకమ్మ : రోబోటిక్స్ మానవుల పనిని సులభతరం చేయడమే కాకుండా సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అద్విటెక్ రోబోటిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మారుతీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని విజయ హై స్కూల్ లో అడ్వైటెక్ రోబోటిక్ వారి ఆధ్వర్యంలో టెక్ ఎక్స్పో రోబోక్వెస్ట్ 2కె 25 కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోనోటిక్స్ అనేది యాంత్రిక ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ల సమ్మిళిత రూపమన్నారు.

అతిథి భీమ్ గల్ వీడిసీ ప్రెసిడెంట్ నీలం రవి మాట్లాడుతూ సమయం, శ్రమ ఆదా అవుతుంది,ఖచ్చితత్వం, నాణ్యత పెరుగుతుందన్నారు. ప్రమాదకర పనులను రోబోట్లు చేసి, మానవ ప్రాణాలను రక్షిస్తాయని,ఆర్థిక అభివృద్ధికి ఇది ఒక కీలక శక్తి  అని తెలిపారు. స్కూల్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్ సంతపురి మాట్లాడుతూ పరిశ్రమలలో,వైద్య రంగంలో,వ్యవసాయ రంగంలో,విద్య, పరిశోధన,రక్షణ,భద్రత,అంతరిక్ష పరిశోధన,దైనందిన జీవితం లో చాలా ఉపయోగ పడుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అడ్విటెక్ రోబోటిక్స్ డైరెక్టర్ డాక్టర్.శ్రీకాంత్ రామావత్, రాకేష్ మరియు  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Robotics plays a key role in national development