Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 1:56 pm Posted by : ramakrishna

రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ

వెబ్ న్యూస్, బతుకమ్మ: నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలులో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం 2.15గంటలకు బయల్దేరిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ సుమారు 1.30గంటల ప్రాంతంలో గుత్తి రైల్వే స్టేషన్ లో ఆగింది.

ఆ సమయంలో బోగీల్లోకి చొరబడిన ఐదుగురు దుండగులు ప్రయాణికుల బంగారం, మొబైల్ ఫోన్ లు, నగదుతోపాటు ఇతర విలువైన వస్తువులను అపహరించారు. సుమారు 30తులాలకు పైగా బంగారు ఆభవరణాలు అపహరణకు గురయ్యాయి. రైలు తిరుపతికి చేరుకున్న తరువాత బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమరావతి ఎక్స్ ప్రెస్ కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను నిలిపిన సమయంలో పది బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. తిరుపతి రైల్వే పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.