Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2025, 12:45 pm Posted by : ramakrishna

కానిస్టేబుల్ పై దొంగదాడి

ఖమ్మం, బతుకమ్మ: జిల్లాలోని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పని చేస్తున్న ఐడీ పార్టీ కానిస్టేబుల్‌ నరేశ్ పై అంతర్ రాష్ర్ట దొంగ దాడి చేసి నాలుగు చోట్ల కత్తితో పొడిచాడు. కానిస్టేబుల్ నరేశ్ తల భాగంలో, భుజంపై కత్తితో పొడిచాడు. సత్తుపల్లి బస్టాండ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న దొంగను గమనించిన కానిస్టేబుల్ నరేశ్ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్ పై పరారయ్యేందుకు యత్నించాడు. ఈ క్రమంలో దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. నిందితుడిని ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి గ్రామానికి చెందిన సురేందర్ గా గుర్తించారు.