ఎల్లారెడ్డి లో దొంగల బీభత్సం
రూ.15 లక్షల విలువైన సోత్తు చోరి ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. టీచర్స్ కాలనీలో రవిందర్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి రవిందర్ ఇంట్లో దొంగలు పడి తాళాలు బద్దలు కొట్టి బీరువాలోని 10 తులాల బంగారం, రూ.65 వేల నగదు చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన రవిందర్ దొంగతనం జరిగిన విషయం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిశీలించారు.