Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 6:43 pm Posted by : ramakrishna

ఇందల్వాయిలో దొంగల బీభత్సం

 

. . . తాళం వేసిన ఇంట్లో 30,000 చోరీ

 

. . . స్టడీ సర్టిఫికెట్ల కాల్చివేత

 

. . . దుండగులు ఎవరనే కోణంలో పోలీసుల అన్వేషణ

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు తాళం వేసిన ఇంటిలో తాళం పగలగొట్టి చోరీ చేశారు. బాధితురాలు కమ్మరి సత్తవ్వ ఇంటిలో లేని సమయంలో ఇంట్లో ఉన్న బీరువాను పగుల కొట్టి అందులో ఉన్న 30 వేల రూపాయలతో పాటు చదువుకున్న స్టడీ సర్టిఫికెట్లను సైతం దొంగిలించి కాల్చివేశారు.దీంతో విషయం తెలుసుకున్న బాధితురాలు ఆందోళనకు గురయ్యారు.తెల్లారి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం పగలగొట్టి అందులో ఉన్న 30,000 రూపాయలు దొంగిలించి అలాగే తన కొడుకు చదువుకున్న సర్టిఫికెట్లను తీసుకెళ్లి ఫైల్ తో సహా స్టడీ సర్టిఫికెట్లు కాల్చి బూడిది చేశారని ఆమె కన్నీరు చెందారు.

 

 

దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.తన కొడుకు గల్ఫ్ దేశంలో ఉండి అంతో ఇంతో తనకు ఆసరాగా ఖర్చుల నిమిత్తం డబ్బులు పంపుతుండేవాడని ఆ డబ్బులే బీరువాలో దాచుకున్నానని తెలిపారు.దుండగులు ఎవరైనా పట్టుకొని తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.తన కొడుకు చదువుకున్న సర్టిఫికెట్లు ధ్వంసం చేసి ,కాల్చివేసిన దగ్గర దుండగులు తాగిన చీప్ లిక్కర్ బాటిళ్లు వివిధ సామాగ్రి అక్కడ ఉండడం విశేషం

Robbery in Indalvai