Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2025, 2:27 pm Posted by : ramakrishna

బస్వాపూర్ లో దొంగల బీభత్సం

  • తొమ్మిది ఇళ్లల్లో చోరీ
  • బంగారం నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

 

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న 9 ఇళ్లల్లోకి చొరబడి సుమారు 9 తులాల వరకు బంగారం, సుమారు లక్ష వరకు నగదును దొంగలు అతికెళ్ళినట్లు గ్రామస్తులు తెలిపారు. భిక్కనూరు పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలోకి చొరబడి ఆయా ఇళ్లలో 9 తులాల వరకు బంగారు ఆభరణాలను, లక్ష వరకు నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఆంజనేయులు గ్రామానికి చేరుకొని దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించి క్లూస్ టీంకు సమాచారం అందివ్వగా వారు వెంటనే గ్రామానికి చేరుకొని దొంగతనం జరిగిన ఇళ్లలో వేలిముద్రలను క్లూస్ టీం సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Robbery in Baswapur