బాగిర్తి పల్లిలో దొంగల బీభత్సం
భిక్కనూర్, బతుకమ్మ: భిక్కనూరు మండలంలోని బాగిర్తి పల్లిలో శుక్రవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మల్లుగారి లక్ష్మి ఇంట్లోకి చొరబడి రూ.లక్షా 40వేల నగదు, 17తులాల వెండి ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఆంజనేయులు గ్రామానికి చేరుకొని దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించి క్లూస్ టీంకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.