ఎట్టకేలకు మొదలైన ఆర్వోబీ పనులు
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో ఆర్వోబీ నిర్మాణ పనులు కొన్ని నెలల తర్వాత వేగం పుంజుకోనున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో అర్సపల్లి, అడివి మామిడిపల్లి ఆర్వోబీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పద్ధతిలో మాధవ నగర్ ఆర్వోబీ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమైనప్పటికీ, గత భారాస ప్రభుత్వ హయాంలో ఆర్వోబీల నిర్మాణాలు నత్త నడకన కొనసాగాయి. గత ప్రభుత్వం ఈ నిధులను, దారి మళ్లించిందని భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఆర్...