Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 August 2024, 12:07 pm Posted by : ramakrishna

రోడ్డెక్కిన రైతులు

. పోలీసులు ఆంక్షలను పక్కనపెట్టి రాస్తారోకో

. వాహనాల రాకపోకల మళ్లింపు

బతుకమ్మ, నిజామాబాద్ : షరతుల లేని రుణమాఫీ కోసం రైతులు రోడ్డెక్కారు. ధర్నా, ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ రైతులు భారీ సంఖ్యలో మామిడిపల్లి చౌరస్తాకు తరలివచ్చారు. మామిడిపల్లి చౌరస్తా వద్ద నేషనల్ హైవే 44పై బైఠాయించారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కేవలం సమావేశానికి అనుమతినివ్వగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మామిడిపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రాంతంలో సమావేశం కావాల్సిన రైతులు నేరుగా మామిడిపల్లి చౌరస్తాకు చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించారు. అధికార కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. రైతులు నేషనల్ హైవేపై బైఠాయించడంతో పోలీసులు వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు.