Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 6:37 pm Posted by : ramakrishna

రహదారులు జలమయం.. రాకపోకలకు ఇబ్బందులు

  • అధికారుల అప్రమత్తత

 

మద్నూర్, బతుకమ్మ: భారీ వర్షానికి ప్రాంతాలు, రహదారులు జరమాయమయ్యాయి రాకపోకలు నిలిచిపోయాయి.మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలోని పలు గ్రామాలు భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తి, రహదారులు మూసుకుపోతున్నాయి. మద్నూర్ మండలంలోని సోనాల, తడి హిప్పర్గా, గ్రామాల మధ్య రహదారిపైకి లేండి వాగు వరద నీరు ప్రభావం ఎక్కువగా ఉండడంతో పోటెత్తాడంతో బీటీ రోడ్డుపైన భారీగా వరద నీళ్లు ప్రవహించన పరిసర ప్రాంతాలను మద్నూర్ తహసిల్దార్ ముజీబ్,  ఎంపీడీవో రాణి, పోలీస్ శాఖ, అగ్రికల్చర్ తదితర శాఖల అధికారులు అప్రమత్తమై  ప్రజలు వెళ్లకుండా దారిని మూసి వేయించారు. డోంగ్లి మండల లింబూర్, హసన్ టాక్లి గ్రామాల మధ్యగల వాగు పొంగిపొర్లడంతో రహదారిని మూసివేశారు. గోజేగావ్, తడి హిప్పర్గా, లింబూర్, చిన్న టాక్లి, పెద్ద టాక్లి, సిర్పూర్ గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు తగ్గేవరకు పలు గ్రామాలు రాకపోకలు జరగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద పెరిగినట్లు అయితే పలు గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లే ఆస్కారం కనిపిస్తోంది. దీని మూలంగా అధికారులు జలదిగ్బంధానికి గురయ్యే గ్రామాల ప్రజలకు ఎలాంటి సహాయాన్నికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను సూచించారు.