. . . ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, బతుకమ్మ :
ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శనివారం బాన్సువాడ పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అలైవ్, అరైవ్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం వరకు ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే పోచారం హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన హెల్మెట్లను ధరించాలని, ద్విచక్రం వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరని స్పష్టం చేశారు. లైసెన్స్ నైపుణ్యం ఉన్నప్పుడే వాహనం నడపాలని, 18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యతని, ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, బాన్సువాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, బాన్సువాడ రూరల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, పోలీసు అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
85