రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి

– ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి   ఎడపల్లి, బతుకమ్మ :   ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాలను నివారించుకోవాలని బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై ధూపల్లి గేట్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధూపల్లి క్రాసింగ్‌ను బ్లాక్ స్పాట్‌గా గుర్తించామని, అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడానికి ఆర్‌ అండ్‌ బి శాఖతో...