Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 6:18 pm Posted by : ramakrishna

రోడ్డు భద్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలి

 

. . .  నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, క్షేత్రస్థాయిలో తప్పకుండా ప్రమాదకర ప్రదేశాలను తనిఖీలు చేసి గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తల కోసం వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని, రోడ్డు ప్యాచ్‌ల గుర్తించాలని, గుంతలు, దెబ్బతిన్న రోడ్డు భాగాలను గుర్తించాలన్నారు. అటవీ ప్రాంతాలలో భద్రతా చర్యలు పెంచాలని, అవసరానికి అనుకూలంగా వివిధ రోడ్డు మార్గాలలో (మలుపులు, వంతెనలు & కల్వర్టులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలు) రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేయాలని, ప్రమాదం జరిగే స్థలాన్ని గుర్తించే ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని, స్పష్టంగా కనిపించడం కోసం రిఫ్లెక్టివ్ మార్కింగ్‌లను ఏర్పాటు చేయాలన్నారు.

 

Road safety programs should be intensified.

 

ప్రధాన కూడళ్లు, ప్రమాదకర ప్రదేశాలు, ఎక్కువ మంది నడిచే ప్రాంతాలు సాధ్యమైన చోట సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసి, భారీ ట్రక్కులు, బస్సులు (ఆర్ టీసీ & ప్రైవేట్) డ్రైవర్లకు అనునిత్యం అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ జి.బస్వా రెడ్డి, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి జె.ఉమామహేశ్వర రావు, ఆర్.టి.సి డిపో మేనేజర్ బి. ఆనంద్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, ఐ-డార్ మేనేజర్ వర్ష, ఎన్.ఎస్.సి జాయింట్ సెక్రెటరీ దుష్యంత్, ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్, సిసిఆర్బి ఇన్స్ పెక్టర్ అంజయ్య, వివిధ శాఖలకు చెందినటువంటి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.