శ్రీ చైతన్య పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని శ్రీ చైతన్య పాఠశాలలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 1,200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, ట్రిపుల్ రైడింగ్ నిషేధం, మద్యం...