- స్నేహితుడే దారి దోపిడికి సూత్రదారి
- ముగ్గురిని అరెస్టు చేసి సొత్తు రికవరీ చేసిన పోలీసులు
కమ్మర్ పల్లి, బతుకమ్మ : దారి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను 24 గంటలలోనే అరెస్టు చేసినట్లు భీంగల్ సిఐ పొన్నం సత్యనారాయణ తెలిపారు. కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ సత్యనారాయణ మాట్లాడుతు.. కమ్మర్ పల్లి మండలానికి చెందిన కొమ్ము లక్ష్మి నారాయణ ఈ నెల 16న భీంగల్ కు వెలుతుండగా కోనాపుర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారికాచి కత్తి చూపించి రూ.3.50 లక్షల రూపాయాలను దోచుకున్నారు. కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు. విచారణలో భాగంగా స్థానికంగా సీసీ కెమెరాలను, సాంకేతిక విషయంలో విచారణ చేసిన దోపిడీకి పాల్పడిన వ్యక్తుల వివరాలు దొరకలేదు. బాధితుడు లక్ష్మినారాయణ తన వెనుక బైక్ పై వచ్చిన తన మిత్రుడు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం విలయతబాద్ కు చెందిన బోదాస్ జలంధర్ పై అనుమానాలను వ్యక్తం చేశారు. దానితో పోలీసులు విచారణ చేపట్టగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం గుంటూర్ జిల్లా వాసి ప్రస్తుతం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేటకు చెందిన బోదాస్ రాజ శేఖర్, గుంటూర్ జిల్లా సత్తేనపల్లికి చెందిన తొమ్మంటు ప్రసాద్ తో కలిసి లక్ష్మినారాయణ హర్వేష్టర్ కొనుగోలుకు రూ3.50 లక్షలతో వెలుతున్న విషయం చెప్పి దారి కాచి దోచుకోవాలని ప్లాన్ చేశారు. జలందర్, లక్ష్మి నారయణ వెంట ఉండి అతడు భీంగల్ వెళ్లు దారి అసుపాసుల వివరాలను తెలిపారు. దానితో రాజశేఖర్, ప్రసాద్ లు కోనాపూర్ వద్ద దారి కాచి కత్తితో బెదిరించి దోపిడాకి పాల్పడ్డారు. శుక్రవారం ముగ్గురు నిందితులను మెట్ పల్లిలోని ఓ లాడ్జీలో పట్టుకుని వారి వద్దనుంచి రూ.3,40,000, రెండు నెంబర్ లు కలిగిన ఒక స్కూటీ, కత్తి, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజు వ్యవధిలోనే కేసును చేదించిన కమ్మర్పల్లి ఎస్సైఅనిల్ రెడ్డిని, పోలీస్ సిబ్బందిని సిఐ అభినందించారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.