యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతు పనులు
రోడ్లు-భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి ప్రజా రవాణ వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రోడ్లపై గుంతలు లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులలో మరమ్మతులు చేపడుతుండడం వల్ల చాలాకాలం పాటు రహదారులు మన్నికగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్...