Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 8:50 pm Posted by : ramakrishna

భారీ వర్షాలు నేపథ్యంలో కోతకు గురవుతున్న రోడ్డు

 

. . . ప్రమాదాలకు నిలయంగా ధర్పల్లి వైపు వెళ్లే రోడ్డు

 

. . . పట్టించుకోని అధికారులు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రం నుండి ధర్పల్లి, సిరికొండ, భీంగల్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుకు భారీ వర్షం నేపథ్యంలో రోడ్డు పూర్తిగా కూతకు గురి కావడంతో అతి ప్రమాదకరంగా మారింది కానీ సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు గానీ పంచాయతీ అధికారులు గాని కోతకు గురైన రోడ్డుకు కంచె వేయడం కానీ మరమ్మత్తులు చేయడం కానీ మరిచిపోయారు. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రయాణికులకు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ మేరకు ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన పలువురు ప్రజలు మాట్లాడుతూ ధర్పల్లి వైపు వెళ్లే రోడ్డు ఇరువైపులా భారీ వర్షాల నేపథ్యంలో కోతకు గురి కాగా సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ లక్షలాది వేతనాలు పోతున్న అధికారులు ప్రజల ప్రాణాలను కాపాడాల్సింది పోయి వారి ప్రాణాలతో చెలగాటమాడంపై పలువురు అసంత్రప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆర్ అండ్ బీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతి భారీ వర్షాలు నేపథ్యంలో ధర్పల్లి వైపు వెళ్లే రోడ్డు వర్షపు నీటికి కోతకు గురైందని గుర్తు చేశారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.