- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ బాన్సువాడ : రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం హుమ్నాపూర్ నుంచి ఆఫందిఫారం వరకు సీఆర్ఆర్ గ్రాంట్ రూ.50 లక్షలతో నిర్మించనున్న మెటల్ రోడ్డుకు బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా నాయకులు తదితరులు పాల్గొన్నారు.