Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 6:25 pm Posted by : ramakrishna

జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాస్తారోఖో

 

. . . ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారుల పేర్లపై పిండప్రధానం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోఖో నిర్వహించారు. ఏడాది క్రితం డివైడర్లను స్వయంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో తొలగించి పున:నిర్మాణానికి నోచుకోకపోవడంతో ఇబ్బందులపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీకి పిండప్రధానం చేశారు. గంప గోవర్ధన్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద గత సంవత్సరం వరదల వల్ల కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్వయంగా డివైడర్లను తొలగించి సంవత్సరకాలం గడుస్తున్న డివైడర్ లను ఇంకా నిర్మించకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన నిర్వహించి రివ్యూ మీటింగ్ సంవత్సర కాలం గడిచిపోవడంతో నిరసన తెలుపామని పేర్కొన్నారు. డివైడర్లు నిర్మించకపోతే ఆందోళన చేస్తామని తెలిపారు.