Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 2:10 pm Posted by : ramakrishna

రుద్రూర్ లో ఆర్టీసీ – బస్సు, లారీ ఢీకొని రోడ్డు ప్రమాదం

 

. . .  బస్సు లారీ డ్రైవర్ తో సహా 20 మందికి తీవ్ర గాయాలు..

 

. . .  సంఘటన స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ సిపి సాయి చైతన్య

 

 రుద్రూర్, బతుకమ్మ  :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని మంగళవారం జవహర్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోధన్ నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ TG 16 Z 0102 నంబర్ వల్ల ఎక్స్ ప్రెస్  బస్సు, వర్ని నుండి రుద్రూర్ వైపు వెళ్తున్న TS 22 T 3348 నంబరు గల డస్ట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు లారీ డ్రైవర్ తో సహా 20 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు సమాచారం. వెంటనే స్పందించిన రుద్రూర్ ఎస్సై సాయన్న ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నాలుగు అంబులెన్స్ ల ద్వారా బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Road accident in Rudrur, RTC bus and lorry collide

అనంతరం సంఘటన స్థలాన్ని నిజామాబాద్ సిపి సాయి చైతన్య, బోధన్ ఎసిపి శ్రీనివాస్ సందర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Road accident in Rudrur, RTC bus and lorry collide