Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 June 2025, 4:04 pm Posted by : ramakrishna

రాజంపేటలో రోడ్డు ప్రమాదం : తాత, మనుమడు దుర్మరణం

టీవీఎస్ ఎక్సెల్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు.. నిలిచిన వాహనాలు

 రాజంపేట, బతుకమ్మ  : టీవీఎస్ ఎక్సెల్  ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తాత, మనుమడు దుర్మరణం చెందారు. ఈఘటన కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండల కేంద్రం సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  బస్వన్నపల్లి గ్రామానికి చెందిన   నడిపి సిద్ధిరాములు(50), తన మనుమడు శ్రేయాంశ్ (04) కు కుక్క కురవడంతో  రాజంపేట పీహెచ్సీకి టీవీఎస్ ఎక్సెల్ పై తీసుకెళ్లాడు. తిరిగి వెళ్తుండగా రాజంపేట మండల కేంద్ర సమీపంలో  ప్రమాదవశాత్తు అదుపుతప్పి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వేగంగా ఆర్టీసీ బస్సు (Ap29Z1743) టీవీఎస్ ఎక్సెల్ పై కి దూసుకెళ్లింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ముందు భాగంలో టీవీఎస్ ఎక్సెల్  తో పాటు మృతులు ఇరుక్కుపోయారు. ఈవిషయం తెలుసుకున్న బస్వన్నపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై ఆందోళన చేస్తున్నారు. దీంతో కామారెడ్డి నుంచి మెదక్ కు గుండారం వెళ్లే రోడ్డు లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు కిందనే మృతులు టీవీఎస్ ఎక్సెల్ అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతూనే ఉంది. సీఐ లింగమూర్తి ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Road accident in Rajampet: Grandfather and grandson die

Road accident in Rajampet: Grandfather and grandson die