దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం

నిజామాబాద్, బతుకమ్మ :  దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు సహ మరొకరు దుర్మరణం చెందారు. ఈఘటన మహారాష్ట్రలోని బోకర్ తాలుకాలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాలాజ్ గణేశ్ దర్శనానికి జిల్లాలోని వర్ని మండలం హుమ్నాపూర్ నుంచి 15 మంది మూడు కార్లలో వెళ్లారు. స్వామి వారిని దర్శించుకొని సాయంత్రం 4 గంటలకు తిరుగపయనమయ్యారు. మూడు గంటల ప్రయాణం తర్వాత మహారాష్ట్రలోని బోకర్ తాలుకా నందా గ్రామం వద్ద ఓ కారు ఆగి ఉన్న...