Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 11:46 am Posted by : ramakrishna

చిన్న మల్లారెడ్డి శివారులో రోడ్డు ప్రమాదం

 

. . . కల్వర్టు ను ఢీకొట్టిన కారు

. . . 8 మందికి గాయాలు

 కామారెడ్డి , బతుకమ్మ:

కామారెడ్డి పట్టణ శివారులోని చిన్న మల్లారెడ్డి గ్రామ శివారులో కారు కల్వర్టు ను ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. రాజంపేట మండలం అర్గోండ గ్రామానికి చెందిన చిదుర సిద్ధిరాములు కోడుకు భరత్ వివాహం కామారెడ్డి పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో ఉంది. దానికోసం సిద్ధిరాములు, అతని భార్య వినోధ, సోదరి, మరో నలుగురితో కలిసి కారులో ఫంక్షన్ హల్ కు బయలు దేరారు. ఫంక్షన్ హల్ కు 10 నిమిషాల్లో చేరుకుంటారు అనగా కారు చిన్న మల్లారెడ్డి శివారులో కల్వర్టును డి కొట్టింది. ఈ ప్రమాధంలో సిద్ధిరాములు, వినోద తో పాటు మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.