. . . తృటిలో తప్పిన ప్రమాదం
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం నిజామాబాద్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. కారు అతివేగంగా వచ్చి టోల్ ప్లాజా సమీపంలో డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడడంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టంగా భావిస్తున్నారు. ఇందల్వాయి ఎస్ఐ సుమలత సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి అక్కడే ఉన్న క్రేన్ సహాయంతో పార్టీలు కొట్టిన కారణం తీయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమలత తెలిపారు.