నిజామాబాద్ సి టీ, బతుకమ్మ : ఆర్ఎంపి, పిఎంపి గ్రామీణ వైద్యులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్ మహిళల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ సదరు మహిళ డిష్పల్లి వైద్యుడిపై చెప్పుతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం నిజామాబాద్ గ్రామీణ ఆర్ఎంపి, పిఎంపి వైద్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పూలంగ్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో పేద ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించే విధంగా అందించే రాత్రింబవళ్లు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలో విఫలం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా ఓ మహిళ నిరసన కార్యక్రమంలో కి చొరబడి డిచ్పల్లి కి చెందిన అశోక్ కుమార్ అనే ఆర్ఎంపి వైద్యుడిపై చెప్పుతో దాడి చేసింది. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ వైద్యం కోసం వెళ్తే సదరు ఆర్ఎంపీ డాక్టర్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అందుకే సదరు ఆర్ఎంపీ డాక్టర్ పై చెప్పుతో డాడీకి దిగినట్లు తెలిపారు.
