. . . ఆసుపత్రి నుంచి పరారీ ప్రయత్నంలో పోలీసుల పై దాడికి యత్నం
. . . మూడు రౌండ్ల పైర్ చేసిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారిన రియాజ్ పోలీసుల కాల్పుల్లో ఖతం అయ్యాడు. ఆదివారం పోలీసులకు గాయాలతో చిక్కిన రియాజ్ ను వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. సొమవారం జీజీహెచ్ లో చికిత్స పొందుతూ రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై దాడికి యత్నించడంతో వారు కాల్పులు జరిపారు. ఆదివారం పోలీసులు మూడు రౌండ్లు కాల్పులలో రియాజ్ హతమయ్యాడు.
Riyaz killed in police firing
ఈ నెల 17న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య చేసి పరారీ అయిన రియాజ్ ఈ నెల 19న నిజామాబాద్ ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆదివారం సైతం రియాజ్ అతడిని పట్టుకునేందుకు వచ్చిన ఆసిఫ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన విషయం విధితమే. అక్కడ పోలీసులు పట్టుకుని సమయంలో గాయపడిన రియాజ్ ను చికిత్స నిమిత్తం జిజిహెచ్ కు తరలించారు. జీజీహెచ్ లో పోలీసులు ఎన్ కౌంటర్ సంచలనం రేపుతోంది. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. పోలీసు అధికారులు సైతం రియాజ్ ఎన్ కౌంటర్ ను ధ్రువీకరించారు. గత నాలుగు రోజులుగా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పాత నేరస్తుడు రియాజ్ ఎన్ కౌంటర్ విషయం సంచలనంగా మారింది.

