హైదరాబాద్,బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతుందని, ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. పలు చోట్ల రౌడీ షీటర్లు తిరుగుతున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యలకు జూబ్లీహిల్స్ ఏం పని అని ఆమె ప్రశ్నించారు.