బియ్యం నిల్వలను వేగంగా తరలించాలి
జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో గల మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు, ధాన్యం బస్తాలను భద్రపరుస్తున్న తీరును గమనించారు. ఎన్ని రైస్ మిల్లుల నుండి ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిగిన బియ్యం నిల్వలు గోడౌన్లకు చేరాయి, ఇంకా ఎన్ని నిల్వలు రావాల్సి ఉంది, వాటి...