సకాలంలో నిర్ణీత రైస్ మిల్లులకు తరలించాలి
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ నిజామాబాద్, బతుకమ్మ: రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో తూకం జరిపించి, నిర్ణీత రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మాక్లూర్ మండలంలోని మాదాపూర్, మాక్లూర్ లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం...