. . . జిల్లా కలెక్టర్ కు బీజేపీ వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ సాగులో భాగంగా విత్తడానికి హెచ్ఎంటి (సోనా), డబ్ల్యూజిఎల్ -962, బిపిటి-5204 ( సాంబ మసూరి), జేజిఎల్ -1798 వంటి వరి వంగడాలు అనుకూలమని వాటిని మాత్రమే విక్రయించేలా ఆదేశించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని బిజెపి జిల్లా అధ్యక్షుడు కులాచార దినేష్ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి బీజేపీ ఆధ్వర్యంలో జిల్లాలో రైతులు పండించే వరి రకాల విత్తనాలు మాత్రమే విక్రయించేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. ఈ సందర్భంగా కుల చారి దినేష్ మాట్లాడుతూ…. ఈ వానకాలం సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సంపూర్ణ కావేరి 108, ఎంటియు-1282, ఎంటియూ -1224, కేఎన్ఎం -7715, కేఎన్ఎం -12472, ఆర్ బి ఆర్ -1200, సిసిఆర్ఏ, కోణార్క్ రకాల వరి విత్తనాలు జిల్లాకు సరిపడవని వారిని బలవంతంగా రైతులు సాగు చేస్తే ఆశించినంత దిగుబడి రాక నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభమవుతుందని సాధారణంగా రైతులు నారు పోసేందుకు సిద్ధంగా ఉంటారని ఇప్పటికే విత్తనాల పంపిణి జరుగలేదని తెలిపారు. పంటల విత్తు సమయం ఆసన్నమైందని ప్రభుత్వ సరఫరా లేదని ఆంక్షల వల్ల రైతులు ఎక్కడ కొనుగోలు చేయాలో తెలియక సతమతమౌతున్నారా ని పెర్కోన్నారు. రైతులు సంప్రదాయంగా వచ్చే దొడ్డు వడ్ల సాగు చేస్తే వారికి బోనస్ రాక, కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్నారు అని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా రైతులు సాగు చేసే వరి వంగడాల విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ప్రభుత్వం సూచించిన విత్తనాలు సాగు చేసిన కర్షకులకు బోనస్ ఇప్పించేలా కలెక్టర్ సిఫారసు చేయాలని కోరారు. రైతులకు ముందుగా విత్తనాలు పంపిణీ ప్రారంభింప చేయాలని కోరారు.
