బతుకమ్మ,మోర్తాడ్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి. శెట్ పల్లి సొసైటీ పరిధిలోని డొంకల్, దర్మోరా, శేట్ పల్లీ గ్రామాల్లో సోమవారం వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను చైర్మెన్ సింగిరెడ్డి రాజేశ్వర్, ఏం యం సీ చైర్మన్ పాలెం నర్సయ్య వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ రైతులు పరికి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమం లో సంఘం ఉపాధ్యక్షులు పత్రి సుదర్శన్, సహకార సంఘం కార్యదర్శి రఘు, నారాయణ గౌడ్, సంఘ డైరెక్టర్ లు, ఆయా గ్రామాల రైతులు సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
