Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 6:19 pm Posted by : ramakrishna

ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

బతుకమ్మ,మోర్తాడ్: ప్రతి ఒక్కరు వరి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఏపీఎం ప్రమీల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్ చెల్లించుటకు నిర్ణయించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలో గురువారం ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వరి కొనుగోలు కేంద్రం ఇంచార్జి తడకల శ్రీనివాస్ మాట్లాడుతూ సన్న రకం వడ్లకు రూ.2320 దొడ్డు రకం వడ్లకు రూ.2300 ధర చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వప్న, సుజాత, రాకేష్, మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.