Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 6:04 pm Posted by : ramakrishna

ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

మెండోరా, బతుకమ్మ:మెండోరా మండల కేంద్రంలో మహిళా సమైక్య శాఖ ( ఐకేపీ) ఆధ్వర్యంలో సోమవారం వరి కొనుగోలు కేంద్రాన్ని వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి  చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి ,తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం గంగా రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగ ఎపీఎం గంగారాజు  మాట్లాడుతూ ప్రభుత్వం  ఏర్పాటు చేసిన  కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు నాణ్యమైన వరి ధాన్యంను  కొనుగోలు కేంద్రంకు తీసుకురావాలని తెలిపారు.  కార్యక్రమంలలో ,రైతులు గ్రామ విఓఏ లు, అధ్యక్షురాండ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.