రైస్ మిల్లర్లే దళారులు
. సొసైటీ అధికారులతో కుమ్మక్కు . రైతులకు సమాచారం ఇవ్వకుండానే కడ్తా బాన్సువాడ, బతుకమ్మ: సొసైటీ అధికారులతో కుమ్మక్కైన రైస్ మిల్లర్లు దళారుల అవతారం ఎత్తారు. చెన్ను పట్టని ధాన్యమే కాకుండా చెన్ను పట్టిన ధాన్యంలో నుంచి కూడా ఒక బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. మహ్మద్ నగర్ మండలం గున్కుల్ సొసైటీ పరిధిలో నర్వ, మహమ్మద్ నగర్, గున్కుల్, బూర్గుల్, తుంకిపల్లి, సింగీతం మొత్తం 9 కొనుగోలు కేంద్రాలు ఉండగా, మిగతా గ్రామాల రైతుల కోసం ఐకేపీ ఆధ్వర్యంలో ఆరు...