Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2025, 2:47 pm Posted by : ramakrishna

బాలుడిని బలిగొన్న వరి కోత మిషన్

మెదక్ జిల్లా చేగుంట మండలంలో ఘటన

మెదక్, బతుకమ్మ : ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని వరి కోత మిషన్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో చోటు చేసుకుంది. దీంతో ఇబ్రహీంపూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.