రుద్రూర్, బతుకమ్మ: గత మూడు రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు రుద్రూర్ గ్రామంలోని కాటి వాగు వద్ద వరి పంటలు నీట మునిగాయి. గ్రామానికి చెందిన మురళి స్వామి 4 ఎకరాలు, మల్లేపూల సుధాకర్ 3 ఎకరాలు, అయ్యావార్ రాములు 5 ఎకరాలు, ధమ్మ సాయి ఎకరంన్నర, అయ్యప్ప స్వామి రాము 7 ఎకరాల పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.