Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 3:28 pm Posted by : ramakrishna

నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై సమీక్ష

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పని తీరుపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో  గురువారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశమై నూతన భవన నిర్మాణాలకు అనుమతులు, క్రబద్దీకరణ, అక్రమ కట్టడాలపై చేపట్టిన చర్యలు తదితర వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఫైళ్లను తనిఖీ చేసి, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్ రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన క్రమబద్దీకరణ ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. సమీక్షా సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవిబాబు, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Review of the performance of the Town Planning Department of the Municipal Corporation