Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2025, 7:22 pm Posted by : ramakrishna

సబ్ కలెక్టర్ రెవెన్యూ సదస్సుల సమీక్ష

బతుకమ్మ, బోధన్: బోధన్ సబ్ కలెక్టర్  వికాస్ మాతో సోమవారం రోజున సాలూరా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుండి వచ్చిన వివిధ దరఖాస్తులను పరిశీలించారు. సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దరఖాస్తులను మండల్ వారీగా వర్గీకరించి నోటీసులు జారీ చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా భూవివాదాలు, మ్యూటేషన్లు, సర్టిఫికెట్లకు సంబంధించి వేగంగా స్పందించాలని ఆదేశించారు.

Review of Sub Collector Revenue Conferences