Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 8:22 pm Posted by : ramakrishna

తహసీల్దార్ బాలయ్య ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

 

. . . ఎలాంటి అవాంతరాలకు తావివ్వద్దు

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి గ్రామంలో జనాభా గణన, ఇండ్ల గణన నిర్వహిస్తున్న సందర్భంగా తహసిల్దార్ కార్యాలయం లో శుక్రవారం సెన్సెస్ సూపర్ వైజర్ ల సమావేశము ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలయ్య మాట్లాడుతూ జరుగుతున్న ఇండ్ల సర్వే లో ఏ ఒక్క ఇంటిని వదలకుండా ఎన్యుమరేటర్ లతో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఎన్యుమరేటర్ లు ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి సూపర్ వైజర్ లు అప్ లోడ్ చేయాలని ఆయన సూచించారు.