ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
వెబ్ డెస్క్, బతుకమ్మ : భూ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్‌తో పాటు పట్టాదార్ పాస్‌బుక్ జారీకి అవసరమైన నివేదిక అందించేందుకు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. బీర్పూర్ (వీ & ఎం) తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మంచికట్ల రాహుల్ ఫిర్యాదుదారుడి భూమికి ఫీల్డ్ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్, పట్టాదార్ పాస్‌బుక్ జారీకి అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి తొలుత రూ.50 వేలు లంచం...