Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 5:36 pm Posted by : ramakrishna

ఏసిబికి చిక్కిన రెవెన్యూ ఇన్స్ పెక్టర్

 

వరంగల్, బతుకమ్మ:

 

మ్యూటేషన్ కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్టు ఇవ్వడానికి లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ఏసిబికి చిక్కారు.. వరంగల్ జిల్లా దుగ్గోండి మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న జి.రాంబాబు గురువారం తన కార్యాలయంలోనే ఒక వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోదక శాఖాధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. దుగ్గోండి మండలంలోని ఒక వ్యక్తి తహసీల్ధార్ కార్యాలయంలో మ్యూటేషన్ కోసం ఫీల్డ్ సర్వే రిపోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ ఇన్స్ పెక్టర్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు వరంగల్ రెంజ్ ఏసిబి అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం తన కార్యాలయంలో లంచం తీసుకుంటున్న జి.రాంబాబును రెడ్ హ్యాండేడ్ గా పట్టుకుని వరంగల్ స్పెషల్ ఏసిబి కోర్టు ఎదుట హాజరు పరిచారు.

 

Revenue Inspector caught by ACB