కలెక్టరేట్ లో రెవెన్యూ ఉద్యోగుల నిరసన

నిజామాబాద్, బతుకమ్మ : వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్‌ సహా తహశీల్దార్ ఇతర అధికారులపై దాడిని ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)లో రెవెన్యూ ఉద్యోగులు సోమవారం సాయంత్రం నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్‌ రెడ్డి మాట్లాడుతూ, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌, తహశీల్దార్‌, ఇతర ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విధి నిర్వహణలో భాగంగా గ్రామానికి వెళ్లిన అధికారులపై క్రిమినల్స్...