Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 6:27 pm Posted by : ramakrishna

ఫీజు బకాయిలు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి

  • ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 23 నెలల పాలనలో అందాల  పోటీలకు ఇచ్చిన నిధులు విద్యార్థుల చదువుల ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదని, ప్రజా పాలన అంటే కళాశాలలు  బంద్ ఉండడం! విద్యార్థులు ఇంటి వద్ద ఉండడమా అని?  ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, ప్రభుత్వం రెండు రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా 14వ మహాసభ  సుబోధ్ అధ్యక్షతన  ప్రెస్ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగ  సమస్యలు పరిష్కారం చేయడంలో హామీలు  అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోకుండా వారి చదువులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వం మాట తప్పిందని దసరా దీపావళి లోపు ఇస్తామన్న 1200 కోట్లు ఇవ్వకుండా కేవలం 300 కోట్లు ఇవ్వడం వల్ల నేడు కళాశాలలు నిరవధిక బంధు చేస్తే ప్రభుత్వ స్పందించకుండా విద్యార్థుల చదువుల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని తరగతి గదిలో ఉండాల్సిన లక్షలాది మంది విద్యార్థులు నేడు ఇండ్ల వద్ద ఉంటున్నారని, విద్యార్థులతో కళకళలాడాల్సిన కళాశాలలు మూసివేసి ఉన్నాయని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వంమే కారణం అని అన్నారు.  రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల కోట్లు విడుదలకు నిధులు లేవు కానీ హెలికాప్టర్ లల్లో  మంత్రులు దుబారాగా తిరగడానికి, అందాల పోటీలకు నిధులు వస్తున్నాయని,  రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రత్యేక మంత్రి లేకపోవడం ద్వారానే సమస్యలు పేర్కొన్నాయని తెలిపారు.  ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంక్షేమంపై వారికి ప్రత్యేక మంత్రి నియామకంపై లేదని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని ఎవరిని కలవకుండా సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం, జిల్లా నాయకులు భరత్, కార్తీక్, కుషాల్, చోటు,అబ్దుల్, శశికాంత్,నవీన్ క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Revanth Reddy should resign if fee arrears are not paid