Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 10:34 am Posted by : ramakrishna

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ

బీసీ రిజర్వేషన్లపై బిల్లు అంశాలను వివరిస్తున్న రేవంత్ రెడ్డి

డిల్లీ, బతుకమ్మ : ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే నివాసంలో గురువారం ఉదయం కీలక సమావేశం ప్రారంభమైంది. ఖర్గే నివాసానికి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేరుకున్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన, తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లుల అంశాలను ఖర్గే, రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు.  పార్లమెంటులో ఇండియా కూటమి పార్టీల నేతలతో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సీఎం చర్చించనున్నారు.