Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2024, 10:20 am Posted by : ramakrishna

సీయం రేవంత్ రెడ్డి ఓక రొటేషన్ చక్రవర్తి

  • . . బిఅరెస్ బీజేపీలో విలీనం అవటం ఎప్పటికి సాధ్యం కాదు
  • . . పార్టీ అభ్యర్థులను, పార్టీని గెలిపించే వారినే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలి
  • . . .  నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్
  • బతుకమ్మ, నిజామాబాద్:

కాంగ్రెస్ పార్టీ అమలు కు సాధ్యం కాని హామీలు ఇచ్చి రైతులను, మహిళలను మోసం చేసింది.  రాష్ట్రంలో కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి రూ.2 లక్షలు రైతులు ముందు చెల్లించాక ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ ఏమిటన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రొటేషన్ చక్రవర్తి అంటు  నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ వాఖ్యలు చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్ విలేఖరులతో మాట్లాడుతు.. వైఎస్ రాజశేఖరరెడ్డి రుణమాఫీ చేసిన తీరు అభినందనీయం కాని ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వ తీరుపై రోజురోజుకీ అసహనం పెరుగుతుందని అన్నారు. కేసీఆర్ లాగే రేవంత్ కూడా అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు. బిజెపి తలపెట్టిన రేపటి రైతు దీక్షను విజయవంతం చేయాలని పార్టి శ్రేణులకు పిలుపునిచ్చారు.

బిఅరెస్ బీజేపీలో విలీనం అవటం ఎప్పటికి సాధ్యం కాదు…..

బిఅరెస్ బీజేపీలో విలీనం అవటం ఎప్పటికి సాధ్యం కాదు అని ఎంపి అర్వింద్ అన్నారు.రాష్ట్రం లో బిజేపిలోకి బిఆర్ఎస్ పార్టిని విలీనంపై బిఅరెస్ ని దగ్గరకి రానిచ్చే ప్రసక్తే లేదు అన్నారు. బిఅరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.. కాబట్టి బిఅరెస్ కాంగ్రెస్ లో విలీనం అయినట్లే అని అన్నారు.

పార్టిని గెలిపించేవారిని బిజేపి రాష్ట్ర  అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి….

భారతీయ జనతాపార్టి  సిద్ధాంతాలకు, విలువలకు కట్టుబడి  పార్టిని గెలిపించేవారిని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడిగా ఎంపికచేయాలి అని ఎంపి అరవింద్ అన్నారు. పార్టి అదేశాల ప్రకారం పార్టి అభ్యర్ధులను ఎన్నికలలో గెలిపించే సత్తా ఉన్నవారికి నాయకత్వం భాధ్యతలను అప్పగించాలన్నారు.

Revanth is the rotation emperor