ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి హింసాత్మాకమైన భాషను ఉపయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హుడు కాడని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు అన్నారు. నేర చరిత్ర కలిగిన గుండాలు, ఫ్యాక్షన్ ముఠాల మాటలు ఒక ముఖ్యమంత్రి నోటినుండి రావడమే ఒక విషాదమని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను, భారాస నాయకులైన కేటీఆర్, హరీష్ రావు లను...