- ఇది తెలంగాణ సకలజనాభిప్రాయం
- రేవంత్ ది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన
- బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ఇంటి పండుగ
- నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ ది పేగు బంధం
- బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: ‘రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ ‘ అనేది తెలంగాణ సకలజనాభి ప్రాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో వరంగల్ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిది ఒక దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన అని మండిపడ్డారు. అంతులేని అవినీతి, అణచివేత, కేసులు, అరెస్టులు, భూకబ్జాలు తప్ప రాష్ట్రంలో అణాపైసంత అభివృద్ధి ఉందా? అని నిలదీశారు. కేసీఆర్ హయాం తెలంగాణకు స్వర్ణయుగమని, అభివృద్ధి పరుగులు పెట్టిందని, ‘ ప్రతీ ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో సంతోషం’ కనిపించిందని అయన గుర్తు చేశారు. రాష్ట్రానికి శనిలా దాపురించిన రేవంత్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం మూసీలో కలిసిపోయి ‘ ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతీ కంట్లో విషాదం కనిపిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దుర్నీతికి కేసీఆర్ పదేళ్ల ప్రగతి వైభవం మసకబారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలను మొత్తం పాతరేసిన కాంగ్రెస్ పదహారు నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. వరంగల్ బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ సర్కార్ పతనం ఆరంభం కావడం తథ్యమని ఆయన చెప్పారు. హామీ ఇవ్వక పోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్లు ఖర్చుపెట్టి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్ ది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మ ఒడి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా అమలు చేశాం. రుణమాఫీ, రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24గంటల కరెంట్, ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్లు, మెరుగైన వైద్యం, సర్కారు విద్యా సంస్థలలో సౌకర్యాలు, ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు మళ్లీ కావాలంటే బీ ఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాల్సిందే. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ కారు,సారు కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అని జీవన్ రెడ్డి అన్నారు. కాగాఈనెల 27 వ తేదీన వరంగల్ నగరంలోని ఎల్కతుర్తి వద్ద జరగనున్న బీఆర్ఎస్ ప్లీనరీ మహాసభకు తరలివెళ్లేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాతో బీ ఆర్ఎస్ ది పేగు బంధమన్నారు. బీ ఆర్ఎస్ ఆవిర్భావం తరువాత పార్టీకి తొలి అధికార పదవిని అందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లాదన్నారు. మళ్లీ పార్టీకి పూర్వవైభవం తేవడంలో, కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడంలో కూడా నిజామాబాద్ జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సమావేశంలో జడ్పి మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుజీత్ సింగ్,సత్యప్రకాష్,శేఖర్,రాజేశ్వర్ రెడ్డి,వెల్మల్ రాజన్న,మచ్చర్ల సాగర్,మస్త ప్రభాకర్,పూజ నరెంధర్,రజనీష్,పోల సుధాకర్,అభిలాష్,ఏజాజ్ మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.