Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 February 2025, 1:55 pm Posted by : ramakrishna

ఎల్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్

వెబ్ న్యూస్, బతుకమ్మ : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ తల్లిని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.  బ్రహోత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకొని  రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.  సీఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి, జూపల్లి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Revanth presented silk clothes to Ellamma thalli