Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 2:41 pm Posted by : ramakrishna

యంగ్ ఇండియా స్కూల్ కు శంకుస్థాపన చేసిన రేవంత్

వెబ్ న్యూస్, బతుకమ్మ:  వనపర్తి జిల్లాలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా స్వామివారికి రేవంత్ పట్టు వస్త్రాలను సమర్పించారు. వేదపండితులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను రేవంత్ కు అందజేశారు. అనంతరంలో వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, జెప్స్(బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, శ్రీ రంగాపురం దేవాలయం పనులు, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం, రాజానగరం, పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, సీసీఆర్ రోడ్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రణాళిక బోర్డు వైఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి , జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సాయంత్రం  శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నా రేవంత్

వనపర్తి పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఈమేరకు రేంజ్ ఐజీ సత్య నారాయణ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వారం రోజుల క్రితం పైకప్పు కూలిన ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకొని సజీవ సమాధి అయిన సంగతి తెలిసిందే. రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.